AP: శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న డీసీఎంను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తల్లిదండ్రుల పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.