ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహానికి వెళ్తున్న SUV వాహనం అదుపు తప్పి జనతా ఇంటర్ కాలేజీ గోడను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో వరుడు సహా కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.