హైదరాబాద్‌లోని షేక్ పేట్‌లో మంగళవారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఓ విద్యార్థిని మరణించింది. ఓ లారీ డ్రైవర్ బైక్‌ను ఓవర్ టెక్ చేసే క్రమంలో బైక్‌ను ఢీకొట్టాడు. ఈ క్రమంలో బైక్ వెనుక కూర్చున్న అథర్వి అనే విద్యార్థి కిందపడగా లారీ ఆమె పై నుంచి వెళ్లింది. ఈ ఘటనలో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.