కోటబొమ్మాళి- శ్రీకాకుళం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సింహాచలం వెళ్తూ ఎత్తురాళ్లపాడు వద్ద కాలకృత్యాల కోసం కారు దిగిన ముగ్గురిని ఓ వాహనం ఢీకొట్టింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ముగ్గురూ మరణించారు. మృతులను ఒడిశా వాసులుగా పోలీసులు గుర్తించారు.