గుజరాత్‌లోని పంచమహల్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. గోద్రాలోని డుమేవాల్ సమీపంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ఒకరు మరణించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.