మానేరు నదిపై రోడ్డు-కమ్-రైల్ బ్రిడ్జి నిర్మించాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేశారు. జాతీయ రహదారి 368B సూర్యాపేట నుండి సిరిసిల్ల వరకు ప్రపోజల్‌ను వేములవాడ నుండి కోరుట్ల వరకు విస్తరించాలని కోరారు. విస్తరణ వల్ల ఈ రహదారి వెంబడి ఉన్న తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు వేములవాడ, కొండగట్టు, ధర్మపురి మరింత అనుసంధానమవుతాయని KTR ఆ వినతిపత్రం పేర్కొన్నారు.