రెండేళ్లలో ఇండియాలోనే తెలంగాణ R&B డిపార్ట్‌మెంట్ రోల్ మోడల్‌గా ఉండే విధంగా రోడ్లు డిజైన్ చేయిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఎక్కువగా డ్యామేజ్ ఉన్న రోడ్లకు ఈనెల 11 వరకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. రాష్ట్రంలో హైబ్రీడ్ అన్యూటీ మోడ్ రోడ్ల నిర్మాణంలో వేగం పెంచాలని, హ్యామ్ రోడ్ల నిర్మాణంలో కన్సల్టెంట్‌లను గుర్తించి DPR సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు సెక్రటరియేట్ లో హ్యామ్ రోడ్లపై అధికారులతో మంత్రి సమీక్షించారు.