పెట్రోల్ బంక్ ఉద్యోగిని కాల్చి చంపిన దొంగలు (వీడియో)

60చూసినవారు
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పెట్రోల్ పంప్‌లో దారుణం జరిగింది. పెట్రోల్ బంక్‌లో నగదు దోచుకునేందుకు కొందరు శనివారం యత్నించగా.. ఉద్యోగి ప్రతిఘటించాడు. దీంతో దుండగులు అతడిపై దాడి చేశారు. సంఘటనా స్థలంలో దాదాపు ముగ్గురు ఉద్యోగులు ఉన్నారు. వారు దొంగలను అడ్డుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. ఆ సమయంలో ఓ ఉద్యోగిని వారు తుపాకీతో కాల్చి చంపారు.ఈ ఘటన సీసీటీవీ ఫుటేజీ రికార్డు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్