తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగర పారిశుద్యంపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో మహానగరంలోని రోడ్లపై చెత్తను సేకరించడానికి ఆటోమేటెడ్ ఎలక్ట్రిక్ చెత్త సేకరణ యంత్రాలను(రోబోలను) జీహెచ్ఎంసీ అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది రోడ్లపై చెత్తను శుభ్రం చేస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ చెత్తను తొలగిస్తుంది. ప్రస్తుతం వీటిని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు.