టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డు క్రియేట్ చేశాడు. ఇంగ్లాండ్‌తో నేటి మ్యాచ్‌లో 52 పరుగులు చేయడంతో సచిన్ తెందూల్కర్‌ను అధిగమించి అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక రన్స్ చేసిన రెండో భారత ఓపెనర్‌గా నిలిచాడు. సచిన్ 346 మ్యాచుల్లో 15,335 రన్స్ చేశాడు. రోహిత్ శర్మ 343 మ్యాచుల్లోనే 15,337 పరుగులు చేసి రికార్డు బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ (16,119 పరుగులు, 332 మ్యాచ్‌లు) అగ్రస్థానంలో ఉన్నాడు.