టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను మరో అరుదైన ఘనత ఊరిస్తోంది. హిట్ మ్యాన్ మరో 50 పరుగులు చేస్తే సచిన్ తెంటూల్కర్‌ను అధిగమించి అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక రన్స్ చేసిన రెండో భారత ఓపెనర్‌గా నిలుస్తాడు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ 15,758 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సచిన్ 15,335 పరుగులు, రోహిత్ 15,285 మూడో స్థానంలో ఉన్నారు.