భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో బ్యాటింగ్‌కి దిగిన హిట్‌మ్యాన్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. 5.2 ఓవర్ వద్ద మహ్మద్ బౌలింగ్‌లో లివింగ్ స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇటీవల ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్న రోహిత్.. మరోసారి తక్కువ స్కోర్‌కే పెవిలియన్‌కు చేరడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.