టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తండ్రి కాబోతున్నట్లు తెలుస్తోంది. అతని భార్య రితిక ప్రెగ్నెంట్ అంటూ ప్రస్తుతం నెట్టింట ఓ వీడియో వైరలవుతోంది. దాంతో రోహిత్ అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే వ్యక్తిగత కారణాలతో వచ్చే నెల నుంచి ఆస్ట్రేలియాతో జరిగే తొలి 2 టెస్టులకు అందుబాటులో ఉండనని బీసీసీఐకి రోహిత్ శర్మ సమాచారం ఇచ్చారట. దాంతో రితిక ప్రెగ్నెంట్ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.