రైల్వే ఉద్యోగాలకు సంబంధించి భారీగా టెక్నీషియన్ పోస్టును పెంచుతూ RRB నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 9,144 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ఇదివరకే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలకు అదనంగా 5154 పోస్టులను జతచేసింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 14,298కి చేరింది. అదనంగా పెరిగిన పోస్టుల్లో సికింద్రాబాద్ జోన్ పరిధిలో 959 ఖాళీలు చేరాయి. పూర్తి వివరాలకు: https://rrbsecunderabad.gov.in/wp-content/uploads/2024/08/CORRIGENDUM-ADDENDUM-No.-1-22_08_2024.pdf