కంచె గచ్చిబౌలి భూములను అమ్మి రూ.10 వేల కోట్ల స్కామ్ చేయడం ముమ్మాటికి అవినీతి, నమ్మక ద్రోహమేనని కేటీఆర్ మండిపడ్డారు. బుల్డోజర్లను పంపి అడవులను ధ్వంసం చేయడం ముమ్మాటికి పర్యావరణ చట్టాల ఉల్లంఘనేనని చెప్పారు. రేవంత్ బాధ్యతారాహిత్య చర్యల ఫలితంగా పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిందన్నారు. ఇప్పటికైనా తాను సృష్టించిన విధ్వంసానికి, తన బాధ్యతారాహిత్యానికి, చేసిన రూ.10 వేల కోట్ల స్కామ్‌కు రేవంత్ బాధ్యత వహించాలన్నారు.