TG: బీసీ వసతి గృహాలకు పక్కా భవనాల నిర్మాణం కోసం రూ.100 కోట్లు కేటాయించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి బీసీ సంక్షేమశాఖ ప్రగతి నివేదికను విడుదల చేసిన సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడారు. బీసీ కమిషన్ ఏర్పాటుతో పాటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొత్తగా 8 కార్పొరేషన్లు, ఈబీసీ బోర్డు ఏర్పాటు చేసినట్లు వివరించారు.