త్వరలో రూ.100 కరుణానిధి స్మారక నాణెం

81చూసినవారు
త్వరలో రూ.100 కరుణానిధి స్మారక నాణెం
దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శతజయంతి వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరుణానిధి రూ.100 విలువైన స్మారక నాణేలను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. కాగా, కరుణానిధి స్మారక నాణేన్ని ఆయన జయంతి రోజైన జూన్‌ 3వ తేదీ శతజయంతి ముగింపు వేడుకల సందర్భంగా విడుదల చేయాలని గతంలో నిర్ణయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్