రైతు భరోసా కోసం రూ.17,500 కోట్లు చెల్లించాం: భట్టి

TG: రైతు భరోసా కోసం రేవంత్ సర్కార్ రూ.17,500 కోట్లు చెల్లించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పదేళ్ల పాలనలో పేదల కోసం BRS ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. రూ.లక్ష కోట్లతో డ్వాక్రా మహిళలకు రుణాలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఖమ్మం(D) మధిర పట్టణ ప్రగతిలో రూ.6.45 కోట్లతో చేపట్టిన అంబారుపేట పెద్ద చెరువు ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు.