కుంభమేళా మృతులకు రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా

76చూసినవారు
కుంభమేళా మృతులకు రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాలో బుధవారం జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన వారి కుటుంబాలకు సీఎం యోగి ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం ప్రకటించింది. ఈ మేరకు సీఎం యోగి ప్రకటించారు. కాగా, బుధవారం తెల్లవారుజామున మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానం ఆచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 30 మంది చనిపోగా.. 60 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్