గద్దర్ సేవలకు గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గద్దర్ ఫౌండేషన్‌కు రూ. కోట్ల నిధులను మంజూరు చేస్తూ భాషా సాంస్కృతిక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై గద్దర్ జయంతి ఉత్సవాల నిర్వహణలో ఈ ఫౌండేషన్‌కు భాగస్వామ్య హక్కులు కల్పించనున్నట్టు మరో ఉత్తర్వు విడుదలైంది. రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.