చిన్న, సన్నకారు రైతుల కోసం కేంద్రం 'ప్రధానమంత్రి కిసాన్ మానధన్ యోజన (PMKMY)' స్కిమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా 60 ఏళ్లు నిండిన రైతులకు ప్రతినెలా రూ.3 వేల చొప్పున పెన్షన్ అందుతుంది. 18 - 40 వయస్సు గల రైతులు అర్హులు. రైతులు తమ దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి అప్లై చేసుకోవచ్చు. ఈ స్కీమ్ లో భాగంగా వయస్సు ప్రకారం ప్రతినెలా రూ.55 - రూ.200 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.