

నేటి నుంచి రొట్టెల పండుగ.. 7న వేడుకకు మంత్రి లోకేశ్
AP: మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండుగ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. నెల్లూరు నగరంలోని బారాషహీద్ దర్గాలో ఏటా నిర్వహించే ఈ పండుగకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. సొందల్మాలితో ఇవాళ పండుగ మొదలవుతుంది. 7న గంధం ఊరేగింపు, 8న రొట్టెల పండుగ, 9న తహనీల్ ఫాతెహా, 10న ముగింపు ఉత్సవం నిర్వహిస్తారు. 7వ తేదీన సాయంత్రం ఈ వేడుకలో మంత్రి నారా లోకేశ్ పాల్గొంటారు.