తాగునీటిని వృథా చేస్తే రూ.5 వేలు ఫైన్

57చూసినవారు
తాగునీటిని వృథా చేస్తే రూ.5 వేలు ఫైన్
వేసవిలో నీటి కొరత ఏర్పడకుండా బెంగళూరు వాటర్ బోర్డ్ ముందస్తు చర్యలు చేపట్టింది. ముందుగా తాగునీటి వృథాను అరికట్టేందుకు కఠిన నిర్ణయం తీసుకుంది. తాగునీటిని వృథా చేస్తే రూ.5,000 ఫైన్ విధించనుంది. కార్ల వాషింగ్, ఫౌంటేన్లు, మాల్స్, సినిమా హాళ్లలో మంచినీరు వాడొద్దని సూచించింది. ఉల్లంఘిస్తే రూ.5,000, రూల్స్ పాటించేంత వరకు రూ.500 అదనంగా వసూలు చేస్తామని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్