రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగలేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రూ.5337 కోట్లు నిధులు ప్రకటించారు. సోమవారం ఆయన ఢిల్లీలోని రైల్ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాజీపేట రైల్వే స్టేషన్‌ను అభివృద్ది చేస్తున్నామని, కొన్ని పనులకు అనుమతులు రావాల్సి ఉన్నందున ఆలస్యం అవుతుంతోదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కాజీపేటలో రైల్వేప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు.