మహిళను బెదిరించి రూ.80 లక్షలు టోకరా

80చూసినవారు
మహిళను బెదిరించి రూ.80 లక్షలు టోకరా
సైబర్‌ నేరగాళ్ల చేతిలో మరో మహిళ బలైంది. క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులుగా నమ్మబలికిన నిందితులు తాజాగా చండీఘఢ్‌కు చెందిన ఓ మహిళ నుంచి రూ.80 లక్షలు కాజేశారు. ఆమె ఆధార్‌ కార్డుపై జారీ అయిన సిమ్‌ కార్డును చట్టవిరుద్ధంగా మనీల్యాండరింగ్‌ కార్యకలాపాల్లో వాడుతున్నారని, కేసులు నమోదయ్యాయని బెదిరించారు. రూ.80 లక్షలు ఇస్తే కేసులు కొట్టివేస్తామని, డబ్బులు కూడా రిఫండ్ చేస్తామని నమ్మబలికి రూ.80 లక్షలు తీసుకున్నారు. చివరికి ఆమె పోలీసులను ఆశ్రయించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్