హర్యానాలోని గురుగ్రామ్‌లో టోల్ ఫీజు ఎగ్గొట్టేందుకు ఆర్డీసీ బస్సును డ్రైవర్ వేగంగా నడిపాడు. ఈ నేపథ్యంలో అక్కడున్న సిబ్బందిపైకి ఆ బస్సును దూకించగా.. ఇద్దరు గాయపడ్డారు. గాయపడ్డ సిబ్బందిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ టోల్ బూత్ వద్ద ఉన్న సీసీటీవీలో ఇది రికార్డైంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసులు బస్సు నడిపిన డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.