ఛత్తీశ్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఓ రష్యన్ యువతి వీరంగం సృష్టించింది. మద్యం తాగి కారు నడుపుతూ వీఐపీ రోడ్డులో ఓ బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులకు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ క్రమంలో రష్యన్ యువతి కారు దిగి నడిరోడ్డుపై గొడవకు దిగింది. సరిగ్గా అదే సమయానికి పోలీసులు రావడంతో ఆమెను ఆమెతో పాటు ఉన్న మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.