భారత క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ కౌంటీ క్రికెట్ బాట పట్టారు. క్రికెట్ దిగ్గజం సచిన్ ప్రాతినిధ్యం వహించిన యార్క్‌షైర్ తరఫున కౌంటీ ఛాంపియన్‌షిప్, వన్డే కప్ మ్యాచ్‌లు ఆడనున్నారు. 28 ఏళ్ల రుతురాజ్ కౌంటీల్లో ఆడటం ఇదే మొదటిసారి. కాగా ఇక్కడ ఆడబోయే తొలి మహారాష్ట్ర క్రికెటర్‌గా రుతురాజ్ రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. గైక్వాడ్ యార్క్‌షైర్‌తో ఒప్పందం చేసుకోవడం పట్ల ఆ జట్టు హెడ్ కోచ్ ఆంథోని మెక్‌గ్రాత్ హర్షం వ్యక్తం చేశారు.