రైతు భరోసా రూ.15 వేలు.. నేడు ప్రకటన?

60చూసినవారు
రైతు భరోసా రూ.15 వేలు.. నేడు ప్రకటన?
కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ.15 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయలేదు. అయితే తాజాగా ఈ పథకాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రకటన చేయనున్నారని సమాచారం. కాగా ఇప్పటికే రైతు రుణమాఫీ చేయగా.. మరికొంత మంది అర్హులకు చేయాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్