తెలంగాణలో ఒక ఎకరం వరకు ఉన్న రైతుల అకౌంట్లలో రైతుభరోసా నిధులను అధికారులు జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు. 17.03 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేసినట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత రైతేనని.. ప్రారంభోత్సవం నాడు విడుదల చేసిన నిధులతో కలుపుకొని ఈ రోజు వరకు మొత్తం 1126.54 కోట్లు రైతుభరోసా నిధులు జమ చేశామని మంత్రి పేర్కొన్నారు.