కోయంబత్తూరులో యూకేకి చెందిన సాఫ్ట్‌వేర్ సంస్థ SAAS 140 మంది ఉద్యోగులకు రూ.14.5 కోట్లు బోనస్ ప్రకటించింది. 2022 డిసెంబరు 31వ తేదీకి ముందు చేరిన ఉద్యోగులకు మూడేళ్లు పూర్తి చేసినందుకు వార్షిక వేతనం మీద 50 శాతం అందజేస్తున్నట్టు తెలిపింది. సంస్థ విజయానికి కృషి చేస్తున్న ఉద్యోగులపై మంచి నమ్మకముందని, లాభాలు వచ్చినప్పుడు ఉద్యోగులకు ప్రతిఫలం ఉండాలనేది తమ అభిమతమని సీఈఓ, వ్యవస్థాపకుడు శరవణకుమార్ పేర్కొన్నారు.