రాష్ట్రపతి ద్రౌపది ముర్మును స్టార్ క్రికెటర్ సచిన్ టెండ్కూలర్ కుటుంబసమేతంగా కలిశారు. సచిన్ తో పాటు ఆయన భార్య అంజలి టెండూల్కర్, కుమార్తె సారా టెండూల్కర్ ద్రౌపది ముర్మును కలిశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతికి సంతకం చేసిన టెస్ట్ జెర్సీని సచిన్ అందజేశారు. అంతకముందు రాష్ట్రపతి భవన్‌లో సచిన్‌తో కలిసి ద్రౌపది ముర్ము వాకింగ్ చేస్తూ సంభాషించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.