తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సాయి పల్లవి.. తన నటన, డ్యాన్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో ఈ బ్యూటీ అరుదైన ఘనత సాధించింది. 68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల జాబితాను గురువారం నిర్వాహకులు ప్రకటించగా.. ఇందులో సాయి పల్లవి సత్తా చాటింది. దీంతో సౌత్‌లో ఇప్పటివరకు ఆరు అవార్డులు దక్కించుకున్న హీరోయిన్‌గా సాయి పల్లవి రికార్డు సాధించింది.