పూరీ సముద్ర తీరంలో ఆపరేషన్ ‘సిందూర్’పై ఒడిశాకు చెందిన సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన సైకత శిల్పం కట్టిపడేస్తోంది. భారత ఫైటర్ జెట్ పాకిస్థాన్‌లో విధ్వంసం సృష్టిస్తుంటే.. దానిలో నుంచి సిందూరం వచ్చి భారతీయ స్త్రీ నుదిటిపై పడినట్లు సైకత శిల్పం రూపొందించారు. ‘భారత్ మాతాకీ జై.. న్యాయం లభించింది’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో SMలో వైరల్ అయ్యింది.