ప్రయాణికుడిని కాపాడిన సిబ్బందికి సజ్జనర్ సన్మానం
By Shashi kumar 72చూసినవారుబస్సులో గుండెపోటు వచ్చిన ప్రయాణికుడికి సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించిన కండక్టర్ అంజలి, డ్రైవర్ సైదులును TGSRTC ఎండీ వీసీ సజ్జనర్ ఘనంగా సన్మానించారు. జీడిమెట్ల డిపోనకు చెందిన 192/1 రూట్ నంబర్ బస్సు శుక్రవారం చింతల్ ఐడీపీల్ బస్ స్టాప్ వద్దకు రాగానే మురళికృష్ణ అనే ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. అంజలి, సైదులు బస్సు ఆపి ఒక ప్రయాణికుడి సాయంతో మురళికృష్ణకు సీపీఆర్ చేశారు. అనంతరం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.