ఉపాధి కూలీలు, ఉద్యోగులకు జీతాలు చెల్లించాలి: హరీశ్ రావు

67చూసినవారు
ఉపాధి కూలీలు, ఉద్యోగులకు జీతాలు చెల్లించాలి: హరీశ్ రావు
తెలంగాణలోని రేవంత్ సర్కార్.. ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తుండటం సిగ్గుచేటని BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. ఉపాధి కూలీలు సహా, ఫీల్డ్ అసిస్టెంట్లకు, ఏపీఓలకు, సీఓలకు 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం శోచనీయమని విమర్శించారు. 'ఉపాధి హామీ కూలీల జీతాలను ఎవరి ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు? సీఎం, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉపాధి కూలీలు, ఉద్యోగులకు వేతనాలు వెంటనే చెల్లించాలి' అని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్