AP: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత కొంత కాలంగా స్పాండిలైటిస్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశానికి హాజరైన పవన్ ఆరోగ్యం సహకరించక మధ్యలోనే వెళ్లిపోయారు. కాగా బుధవారం రాష్ట్ర సచివాలయంలో 16వ ఆర్థిక సంఘం సభ్యులతో మంత్రివర్గం కీలకమైన సమావేశంలో పాల్గొంది. ఈ సమావేశంలో పవన్ పాల్గొనగా ఆయన చేతికి సెలైన్ డ్రిప్ కనిపించింది. ఆ ఫొటో నెట్టింట వైరల్ కావడంతో పవన్ కు ఏమైందని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.