బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కి యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. తెరపై మాత్రమే కాదు.. నిజ జీవితంలోనూ హీరోగా నిలుస్తూ అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తాజాగా ముంబైలోని ఒక షాపింగ్‌మాల్‌కి వెళ్లిన సల్మాన్.. అక్కడ ఉన్న చిన్నారులకు వారికిష్టమైన ఆటవస్తువులు కొనిచ్చారు. ఈ దృశ్యాన్ని ఆయన స్నేహితుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది.