రూ.కోట్లలో డబ్బు ఇస్తానని వచ్చినా గత ఏడాది 15 బ్రాండ్స్ వదులుకున్నట్లు నటి సమంత తెలిపారు. ‘ఒకప్పుడు ఇష్టం వచ్చిన బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా ఉన్నందుకు క్షమాపణ చెబుతున్నా. ఇప్పటికీ నా వద్దకు ఎన్నో ఉత్పత్తులకు సంబంధించిన వాణిజ్య ప్రకటనల ఆఫర్స్ వస్తుంటాయి. వాటిని నేను వెంటనే అంగీకరించను. నాకు తెలిసిన ముగ్గురు వైద్యులతో పరిశీలించి.. అవి ఎలాంటి హాని చేయవని నిర్ణయించుకున్నాకే వాటిని చేస్తున్నా’ అని సమంత వివరించారు.