స్టార్ హీరోయిన్ సమంత తన విడాకులపై సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘విడాకులు తీసుకున్న మహిళను ఈ సమాజం ఎలా చూస్తుందో తనకు బాగా తెలుసునని అన్నారు. నా గురించి ఎన్నో అబద్దాలు పుట్టించారు. అందులో నిజం లేదని చాలాసార్లు చెప్పాలనిపించింది. అయితే నాతో నేను చేసుకున్న సంభాషణే ఆపింది. నా జీవితంలో తదుపరి అధ్యాయం కోసం ఎదురుచూస్తున్నా’ అని ఈ సందర్బంగా చెప్పకొచ్చారు.