‘శుభం’ చిత్ర బృందం, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి దిగిన ఫొటోలను బుధవారం సమంత ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ ఫొటో అంతటా వైరల్‌గా మారిన తరుణంలో రాజ్ సతీమణి శ్యామాలి ఇన్‌స్టా వేదికగా ఒక సందేశాత్మక పోస్ట్ పెట్టారు. ‘నా గురించి ఆలోచించి, విని, మాట్లాడేవారితోపాటు నన్ను కలిసి, నాతో మాట్లాడి, నా గురించి రాసే వారందరికీ ప్రేమ, ఆశీస్సులు పంపుతున్నా’ అనే పోస్ట్‌ను ఆమె షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.