మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఉన్న పురందర్ కోటలో 1657 మే 14న శివాజీ, సాయిబాయి దంపతులకు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జన్మించాడు. ఛత్రపతికి రెండు సంవత్సరాల వయసులోనే అతని తల్లి మరణించింది. ఆ తర్వాత అతని అమ్మమ్మ జిజాబాయి పెంచింది. శంభాజీ మహారాజ్ యేసుబాయిని వివాహం చేసుకున్నాడు. వారికి భవానీ బాయి, షాహు అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. 120 యుద్ధాల్లో విజయం సాధించిన శంభాజీ, మొఘల్ దండయాత్రలను అడ్డుకున్నాడు.