హర్ష రోషన్, భాను ప్రకాశ్, జయతీర్థ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'ఏఐఆర్ (ఆల్ ఇండియా ర్యాంకర్స్)'. జోసెఫ్ క్లింటన్ తెరకెక్కించారు. ఈ సిరీస్‌లో దర్శకుడు సందీప్ రాజ్ కాలేజీ హెడ్‌గా తన మాస్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ సిరీస్‌లో చైతన్యరావ్, సునీల్, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ఇది ఈటీవీ విన్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.