సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో నాగల్‌గిద్ద మండల పరిధిలోని పోలీస్ అవుట్ పోస్ట్ ను బుధవారం జిల్లా అడిషనల్ ఎస్పీ సంజీవరావు సందర్శించి పనులను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ లోని రికార్డులను పరిశీలించారు. నిత్యం స్టేషన్ కి ఎలాంటి కేసులు వస్తున్నాయో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్టేషన్లో పోలీసులు సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.