మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే పీర్ల పండుగను హిందూ, ముస్లింలు సోదరభావంతో అత్యంత వైభవంగా జరుపుకున్నారు. మండల కేంద్రంతో పాటు అయా గ్రామాల్లో మొహరం సందర్భంగా తొమ్మిదో రోజు పీర్ల ఊరేగింపును డప్పు చప్పుళ్ల మధ్య ఘనంగా నిర్వహించారు. కుడుకలు, మలిద ముద్దలు, దట్టిలు సమర్పించి భక్తులు తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ ఊరేగింపులో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.