మునిపల్లి లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్సీ హాస్టల్, మోడల్ స్కూల్ ను పరిశీలించారు. ఎల్ఆర్ఎస్ కింద డబ్బులు కట్టిన వారికి సాంకేతిక సమస్యలు వస్తున్నాయని అదరపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.