చౌటకూర్ మండలం బోమ్మారెడ్డిగూడెం గ్రామంలో జగదాంబ భవానీ మాత, సేవలాల్ మహారాజ్ ఆలయం 20వ వార్షికోత్సవం ఏరువాక పూర్ణిమ పురస్కరించుకొని బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఆలయం రంగు రంగులతో ముస్తాబైంది. 11న బుధవారం అమ్మ వారికి, సేవలాల్ మహారాజ్కు అభిషేకం, హోమం, జెండా ఆవిష్కరణ, మిటో పోలీ బోగ్ పూజ, 12న గురువారం బోనాలు ఊరేగింపు, మహా బోగ్ బండార్ ఉంటుందని పౌరా దేవి పీఠాధిపతి బాబుసింగ్ తెలిపారు.