రేగోడ్ లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో గురువారం ఎంఈఓ నిర్వహించిన తనిఖీల్లో ముక్కున కూరగాయలు కనిపించాయి. వెళ్లిపోయిన కూరగాయలు వినియోగించడంపై ఎంఈఓ గురునాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారానికి ఒక రోజు కూరగాయలు మెదక్ నుంచి వస్తాయని స్టోర్ చేయడం ఇబ్బందిగా ఉందని ఎస్ ఓ స్వయంప్రభ తెలిపారు. దీనిపై ఉన్నత అధికారులకు నివేదిక అందిస్తానని ఎంఈఓ తెలిపారు.