రాయికోడ్ మండలం ఇందూర్ లో బుధవారం క్రిస్మస్ వేడుకలను పాస్టర్ యోహాను ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం క్రీస్తు శోభయాత్రను నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కోలాటాలు, భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో సెవెంత్ డే సంఘ పెద్దలు, యువకులు, మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.