సంగారెడ్డి జిల్లాలోని 7 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలకు నూతన కంప్యూటర్‌లను మంజూరు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. జిల్లాలోని మునిపల్లి, కల్హేర్, రామచంద్రపురం, పుల్కల్, చౌటకూర్, గుమ్మడిదల, మొగుడంపల్లి కేజీబీవీలకు త్వరలోనే కంప్యూటర్లు రానున్నాయని అన్నారు.